Lok Sabha Election Schedule 2024 : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lok Sabha Election Schedule 2024 : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..!

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,3:08 pm

ప్రధానాంశాలు:

  •  Lok Sabha Election Schedule 2024 : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..!

Lok Sabha Election Schedule 2024 : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ నగారా మోగింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ ను ప్రకటించారు. అయితే ప్రస్తుత 17వ లోక్ సభ కు జూన్ 16న గడువు ముగియనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ,ఒడిస్సా ,అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వంటి రాష్ట్రాలలో ఈ ఏడాది మే లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం అసెంబ్లీ గడువు జూన్ 2న ముగియనుండగా, ఆంధ్రప్రదేశ్ జూన్ 16 , ఒడిస్సా జూన్ 24 తేదీన గడువు ముగియనున్నాయి. దీంతో ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం అధికారులు స్థానిక రాజకీయ పార్టీల నేతలతో మరియు అధికారులతో క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఎట్టకేలకు ఇప్పుడు షెడ్యూల్ ను విడుదల చేశారు. అయితే గత లోక్ సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో పోలింగ్ నిర్వహించారు.

గత ఏడాది మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించారు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈసారి లోక్ సభ ఎన్నికలు 7 లేదా 8 దశల్లో జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Lok Sabha Election Schedule 2024  ఎన్నికల షెడ్యూల్

లోక్ సభ ఎన్నికలు ఈసారి దేశవ్యాప్తంగా 7 విడుదల్లో నిర్వహించనున్నారు. 543 లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా సిక్కిం, వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేసినట్లుగా సిఈసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మొదటి ఎన్నికలు మార్చి 28 మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు.ఆ తర్వాత జూన్ 4న లోక్ సభ ఎన్నికలు మరియు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. ఇక ఏపీ తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 4 విడతల్లో ఏపీ మరియు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తుండగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. అనంతరం మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.ఇక ఏపీ మరియు తెలంగాణ ఎన్నికల నామినేషన్ వివరాల్లోకి వచ్చినట్లయితే ఏప్రిల్ 18న నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25న నామినేషన్ల ప్రక్రియ చివరి తేదీ.

ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29 గా ప్రకటించడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో సహా 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ షెడ్యూల్ ఇదే. లోక్ సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాలలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ ( రిజర్వ్ ) నియోజకవర్గానికి 4 విడతలలో మే 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది