8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎనిమిదో వేతన సంఘం వస్తోంది.. భారీగా పెరగనున్న జీతాలు
8th Pay Commission : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫారసులను వర్తింపజేస్తున్నారు. అయితే.. త్వరలోనే ఎనిమిదో వేతన సంఘం రాబోతుందా.. 2024 సంవత్సరం ప్రారంభంలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ(ఆర్ఎస్సీడబ్ల్యూఎస్) నిర్మలా సీతారామన్ కు విన్నవించింది. జనవరి 1, 2024 లోపు కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని.. 2019 లో ఉన్న డీఏ, డీఆర్ రేట్లు 2024 వచ్చే సరికి 50 శాతం పెరుగుతాయని.. ఈనేపథ్యంలో కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరారు.
ఏడో వేతన సంఘం ప్రకారం కనీసం వేతనం రూ.18 వేలు మాత్రమే. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.57 మాత్రమే. కానీ.. 3.15 కి ఫిట్ మెంట్ ను పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని అందుకే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అనివార్యం అని ఆర్ఎస్సీడబ్ల్యూఎస్ తెలిపింది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అయితే.. డీఏ, డీఆర్ 50 శాతం పెరగాలి. అప్పుడే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు ఉంటాయి.
8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాకపోతే ఉద్యోగులను మోసం చేసినట్టే
2024 ప్రారంభం లోపు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాకపోతే అది ఉద్యోగులను మోసం చేసినట్టే అని చెప్పుకొచ్చారు. భారతదేశ పర్ కాపిటా ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2015 -16 లో భారత్ పర్ కాపిటా ఇన్ కమ్ రూ.93,293 కాగా, 2022 – 23 లో అది రూ.1,97,000 గా ఉంది. జనవరి 1, 2016 నుంచి జనవరి 1, 2023 వరకు చూసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 42 శాతం పెరిగాయి. అదే పర్ కాపిటా ఆదాయం చూసుకుంటే.. 111 శాతం పెరిగింది. కాబట్టి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేసి డీఏ, డీఆర్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే సొసైటీ రిక్వెస్ట్ చేసింది. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు కానీ.. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం కూడా సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.