ఏంటి బామ్మ… ఈవయసులో కోరికలా? వరుడు కావాలంటూ పండు ముసలావిడ ప్రకటన?
old woman marriage : మనిషికి తోడు చాలా అవసరం. తోడు లేకపోతే జీవితమే ఉండదు. ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో… అది ఒంటరిగా ఉన్నవాళ్లకే అర్థం అవుతుంది. అందుకే… మన పెద్దలు పెళ్లిని కనిపెట్టారు. పెళ్లి వల్ల ఒక మనిషికి తోడు దొరుకుతుంది. ఆ తోడు జీవితాంతం మనతోనే ఉంటుంది కాబట్టి… ఒంటరితనం ఫీలింగ్ ఉండదు. అదే పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఎవరు తోడుంటారు. ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లకు ఒక తోడు ఖచ్చితంగా అవసరం. ముసలితనంలో ఎవ్వరి పనులు వాళ్లు చేసుకోలేరు. ఆ సమయంలో ఖచ్చితంగా వేరే వాళ్ల తోడు కావాల్సి వస్తుంది. జీవిత చరమాంకంలో ఎక్కువగా తోడుండేది వాళ్ల పిల్లలే.
ఒకవేళ పెళ్లే చేసుకోకపోతే తోడుగా భర్త ఉండరు.. భార్య ఉండరు.. పిల్లలు ఉండరు. వాళ్లు ముసలివాళ్లు అయ్యాక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. ఖచ్చితంగా ఓ తోడును వెతుక్కుంటారు అందరు.
అయితే… కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ బామ్మ మాత్రం ఏ తోడు లేకుండా ఇన్ని రోజులు ఒంటరిగా జీవించింది. తన వయసు ప్రస్తుతం 73. పెళ్లి చేసుకోలేదు. టీచర్ గా పని చేసి రిటైర్ అయింది. చిన్నప్పుడు పెళ్లి అయినా… కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి పెటాకులైంది. భర్తతో విడాకులు అవ్వడంతో అప్పటి నుంచి తను ఒంటరిగానే జీవిస్తోంది.
old woman marriage : తనకు భర్త కావాలంటూ ప్రకటన ఇచ్చిన ఆ వృద్ధురాలు
ఇన్ని రోజులు ఒంటరిగా ఎలాగోలా బతికేసింది కానీ… ఇప్పుడు తన వల్ల కావడం లేదట. ఎలాగైనా ఒక తోడు కావాలని కోరుకుంటోందట. ఈ వయసులో నాకు ఒక భర్త కావాలి.. అంటూ ప్రకటనను కూడా ఇచ్చింది ఆ బామ్మ.
ఒంటరిగా బతకాలంటే భయమేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నాకంటూ ఓ కుటుంబం కావాలి. అందుకే ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా బ్రాహ్మణ వ్యక్తి అయి ఉండాలి. వయసులో నాకంటే పెద్దవాడై ఉండాలి… అంటూ ప్రకటనలో చెప్పుకొచ్చింది ఆ ముసలావిడ.
ఆ ప్రకటన చూసి కొందరు నవ్వుకోగా… మరికొందరు తనకు మద్దతు ప్రకటించారు. తన నిర్ణయం సరైనదేనని అక్కడి స్థానికులు తనకు మద్దతు పలుకుతున్నారు. మరి… బామ్మకు సరైన జోడి దొరుకుతుందో లేదో వేచి చూద్దాం.