Good News : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం…ఈ-కేవైసీ చేసిన వారికి లబ్ది…!
ప్రధానాంశాలు:
Good News : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం...ఈ-కేవైసీ చేసిన వారికి లబ్ది...!
Good News : కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి ఈ-కేవైసీ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో అందరూ దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అయితే వ్యవసాయంలో రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 6000 నేరుగా రైతుల ఖాతాలలోకి మూడు విడతలుగా వచ్చి చేరుతాయి. అయితే ఈ పథకం పై పూర్తి అవగాహన లేకపోవడం అలాగే చాలామంది రైతులు రెండు మూడు ఆధార్ కార్డులకు ఒకటే నెంబర్ ఇవ్వడం అలాగే ఆ నెంబర్లు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడం ,అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయి లేకపోవడం వంటి కారణాల వలన రైతులకు ఈ పథకం ద్వారా డబ్బు అందడం లేదు. అందుకే రైతులు ఈ-కేవైసీ చేపిస్తే భవిష్యత్తులో వారికి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి జిల్లాలో 67,995 మంది రైతుల్లో కేవలం 63,365 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. అంటే ఇంకా 4,630 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోవలసి ఉంటుంది. అలాగే 2,149 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అను సంధానం చేసుకోవాల్సి ఉంది.
Good News : కేవైసీ నిబంధనలు….
2019 ఫిబ్రవరి 1 లోపు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు అవుతారు.. అలాంటివార మీసేవ కేంద్రాలు లేదా నేరుగా సెల్ ఫోన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆధార్ కార్డును బ్యాంకు ఖాతా తో పాటు పనిచేసే ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు ఈ-కేవైసీ చేసిన తర్వాత కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోలేకపోతే రైతు బ్యాంకు ను కూడా ఈ-కేవైసీ చేయాల్సి ఉంటుంది.
Good News వెబ్ సైట్….
ఈ పథకానికి ఈ-కేవైసీ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింకు కింద ఇవ్వడం జరిగింది గమనించగలరు. https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పొందడానికి రైతులు కచ్చితంగా ఈ-కేవైసి చేసుకోవాలి. అయితే జిల్లాలో ఇప్పటికీ 463 మంది రైతులు ఈ-కేవైసి పెండింగ్ లో ఉంది. కాబట్టి అర్హులైన రైతులు వెంటనే ఈ-కేవైసి చేయించుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.