Robo : అద్బుతం: అంగ వైకల్యంతో బాధపడుతున్న తన కుక్క కోసం రోబోను తయారు చేశాడు
Robo : రోడ్డు మీద కుక్కులు కనిపిస్తే మనలాంటి వాళ్లం పట్టించుకోకుండా పోతాం. ఏదైనా కుక్క అంగవైకల్యంతో బాధపడుతున్నట్లయితే దాన్ని పూర్తిగా అవైడ్ చేసి చీదరించుకుంటూ పక్కకు వెళ్తూ ఉంటాం. కాని మిలింద్ రాజ్ అలా చేయలేదు. ఒక రోజు అతడికి కనిపించిన కుక్కను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. దాన్ని అన్ని విధాలుగా బాగు చేసేందుకు ప్రయత్నం చేశాడు. కాని అంగ వైకల్యంతో బాధపడుతున్న ఆ కుక్కకు లాక్ డౌన్ సమయంలో సపర్యలు చేయడం కు ఎవరు లభించలేదు. దాంతో దాని కోసం ఏకంగా ఒక రోబోను తయారు చేయడంతో పాటు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కుక్క ఆరోగ్యంను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నాడు.
జోజో ఫుడ్ చాలా స్పెషల్..
ఎన్నో ఆవిష్కరణలు చేసిన మిలింద్ రాజ్ తాను పెంచుకుంటున్న జోజో కోసం తయారు చేసిన రోబోకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. టైమ్ కు జోజో కు ఆహారం ఇవ్వడం తో పాటు దానికి అవసరం అయిన మెడిసిన్స్ ను కూడా రాజ్ ఆపరేట్ చేసినదాన్ని బట్టి ఇస్తూ వస్తుంది. ఆహారంతో పాటు హెల్త్ అవసరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు జోజో ను అప్ డేట్ చేస్తూ వస్తున్న రోబో ను వినూత్నంగా తయారు చేసిన మిలింద్ రాజ్ పై అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు కూడా అభినందలు తెలియజేశాయి.
మిలింద్ రాజ్ ఆవిష్కరణకు రాష్ట్రపతి పురష్కారాలు..
సుదీర్ఘ కాలంగా మిలింద్ రాజ్ ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తున్న ఆవిష్కరణలు అన్ని ఇన్నీ కావు. కరోనా సమయంలో ఒక ప్రత్యేకమైన డ్రోన్ ను తయారు చేయడం ద్వారా ఎంతో మందికి ఉపయోగదాయకమైన పని చేశాడు. మిలింద్ రాజ్ ఆవిష్కరించిన ఎన్నో రోబోలకు మరియు డ్రోన్ లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆయన లాక్ డౌన్ సమయంలో చేసిన ఆవిష్కరణలు మరింతగా జనాలకు ఉపయోగ పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఇలాంటి ఆవిష్కరణలు చేసిన మిలింద్ రాజ్ అద్బుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Milind Raj Made the robot for the dog