Viral Video : పోలీసులతో పిల్లలను కాపాడుకున్న శునకం తల్లి ప్రేమ చాటుకుంది వీడియో వైరల్..!!
Viral Video : ప్రస్తుత సమాజంలో ప్రేమానురాగాలు తక్కువైపోతున్న సంగతి తెలిసిందే. అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్న పిల్లలను తల్లిదండ్రులే కాటికి చేరుస్తున్నారు. ఇదే సమయంలో కనిపించి ఒక స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలు మరొకవైపు. ఇటువంటి సమాజంలో ఒక కుక్క తన పిల్లలను కాపాడుకోవడానికి ఏకంగా పోలీసుల హృదయాలను కదిలించింది. పూర్తి విషయంలోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల భారీ వర్షాలు కొరవడం తెలిసిందే.
దీంతో చాలా వరద నీరు గ్రామాల్లోకి చేరుకోవటంతో అధికార యంత్రాంగం మరియు పోలీసులు లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నోరు లేని కుక్క తన బిడ్డల కోసం పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారిని కట్టిపడేసింది. తన పిల్లలని కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకున్న .. శునకం.. బాధ చూసిన పోలీసులు వెంటనే కరిగిపోయారు. ఈ క్రమంలో శునకం తన పిల్లలు వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన.
తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించి వరదనీటిలో ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటుకున్నారు పోలీసులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.