Crime News : కొడుకుకు టీలో విషం కలిపి ఇచ్చి చంపేసిన తల్లి.. దారుణమైన నిర్ణయం ఆ తల్లి ఎందుకు తీసుకుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Crime News : కొడుకుకు టీలో విషం కలిపి ఇచ్చి చంపేసిన తల్లి.. దారుణమైన నిర్ణయం ఆ తల్లి ఎందుకు తీసుకుంది?

Crime News : సొంత కొడుకును ఎవరైనా చంపుతారా? సొంతం అయినా కాకున్నా ఒక వ్యక్తిని చంపడం అనేది తప్పు. ఓ మహిళ తన సవితి కొడుకును అమానవీయంగా చంపేసింది. 8 ఏళ్ల తన సవతి కొడుకుకు టీలో విషం కలిపి ఇచ్చి చంపేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. అసలు ఆ బాలుడిని చంపాల్సిన అవసరం ఆ మహిళకు ఎందుకు వచ్చిందో తెలుసుందాం రండి. నితిన్ అనే 8 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 January 2023,8:30 am

Crime News : సొంత కొడుకును ఎవరైనా చంపుతారా? సొంతం అయినా కాకున్నా ఒక వ్యక్తిని చంపడం అనేది తప్పు. ఓ మహిళ తన సవితి కొడుకును అమానవీయంగా చంపేసింది. 8 ఏళ్ల తన సవతి కొడుకుకు టీలో విషం కలిపి ఇచ్చి చంపేసింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. అసలు ఆ బాలుడిని చంపాల్సిన అవసరం ఆ మహిళకు ఎందుకు వచ్చిందో తెలుసుందాం రండి.

step mother murders son by giving poison in tea

step mother murders son by giving poison in tea

నితిన్ అనే 8 ఏళ్ల బాలుడి తల్లి సీమ రెండేళ్ల కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో సీమ కొడుకుకు ఆమె ఇన్సురెన్స్ డబ్బులు రూ.12 లక్షలు వచ్చాయి. దీంతో ఆ డబ్బులను ఆ బాలుడి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఆ తర్వాత బాలుడి తండ్రి రాజు.. మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. బాలుడి పేరు మీద రూ.12 లక్షల డబ్బు డిపాజిట్ అయి ఉందని తెలుసుకున్న ఆ మహిళ.. ఆ బాలుడిని వేధించడం మొదలు పెట్టింది.

Crime News : ఆ డబ్బులు చేజిక్కించుకోవడం కోసం నితిన్ ను చంపడానికి ప్లాన్

ఆ డబ్బులు దక్కించుకోవాలని.. దాని కోసం నితిన్ ను చంపాలని ప్లాన్ వేసింది. అందుకోసం.. నితిన్ కు టీ ఇచ్చి అందులో విషం కలిపింది. అది తాగగానే నితిన్ ఆరోగ్యం చెడిపోయింది. దీంతో వెంటనే అతడి తండ్రి కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దాదాపు మూడు రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత నితిన్ మృతి చెందాడు. అయితే.. కొడుకు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు రాజు రెండో భార్యపై అనుమానంతో ఆరా తీయగా మొత్తం విషయం అంతా బయటపడింది. తానే హత్య చేశా అని ఒప్పుకోవడంతో ఆమె దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు జీవిత ఖైదును విధించింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది