Times Now Survey : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. నమ్మకమైన సర్వే రిపోర్ట్‌ మీ కోసం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Times Now Survey : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. నమ్మకమైన సర్వే రిపోర్ట్‌ మీ కోసం

 Authored By himanshi | The Telugu News | Updated on :10 March 2021,10:00 pm

Times Now Survey : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మ్రోగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొత్తం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కూడా దేశం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్‌ మరియు తమిళనాడు రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది. ఓటర్లు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే అయిదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతేందుకు తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ పై ప్రధాని మరియు హోమ్‌ ఇద్దరు కూడా చాలా ఫోకస్‌ పెట్టిన విషయం తెల్సిందే. ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయమై ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక ప్రైవేట్‌ మీడియా సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్‌ సారాంశంను మీ ముందుకు తీసుకు వచ్చాం.

Times Now Survey On : పశ్చిమ బెంగాల్‌ లో దీదీనే..

వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న దీదీ మమత బెనర్జీపై జనాల్లో కాస్త వ్యతిరేకత అయితే ఉంది. కాని ఆమెను ఓడించేంత వ్యతిరేకత లేదు అనేది సర్వే రిపోర్ట్‌. అక్కడ బీజేపీ అధికారం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. కాని ఆ ప్రయత్నాలు రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇక బెంగాల్‌ లో దీదీ మూడవ సారి అధికార పగ్గాలు దక్కించుకోవడం ఖాయం అయ్యింది అంటూ సర్వేలో పేర్కొన్నారు.

 5 states assembly elections : తమిళనాట స్టాలిన్ శకం మొదలు..

తమిళనాట ఇప్పటి వరకు అమ్మ పార్టీ అయ్య పార్టీలు మాత్రమే అధికారం దక్కించుకుంటూ వచ్చాయి. ఈసారి కూడా ఆ రెండు పార్టీల మద్యే పోటీ ఉంది. బీజేపీ మరియు అన్నాడీఎంకే పార్టీలు కలిసి అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం అయ్యేలా కనిపించడం లేదు. కమల్‌ హాసన్ కూడా ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు కాని ఆయన్ను జనాలు పట్టించుకోవడం లేదు. కరుణానిధి తనయుడు స్టాలిన్ సీఎంగా ఈసారి మొదటి సారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ సర్వే రిపోర్ట్‌ వచ్చింది.

Times Now Survey 5 states assembly elections

Times Now Survey 5 states assembly elections

Times Now Survey On : కేరళ మళ్లీ వామపక్షమే..

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరియు బీజేపీలకు కాకుండా వామపక్షంకు మళ్లీ అధికారం దక్కబోతుంది. సీపీఎం నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంటుందని సర్వే ఫలితాలను బట్టి అర్థం అవుతుంది.

5 states assembly elections : అస్సోంలో హంగ్ తప్పదేమో..

126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సోంలో బీజేపీ మరియు కాంగ్రెస్ లు హోరా హోరీగా పోరాడే అవకాశం కనిపిస్తుంది. కాస్త అటు ఇటుగా ఎన్డీయేకు మెజార్టీ సీట్లు వచ్చినా అధికారం దక్కించుకునే స్థాయిలో వస్తాయా అంటే అనుమానమే అన్నట్లుగా ఉంది.

5 states assembly elections : పుదుచ్చేరిలో ఎన్డీయే..

30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా అక్కడ అసెంబ్లీలో ఎన్డీయేకు బాధ్యతలు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లుగా సర్వేలో వెళ్లడయ్యింది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది