Viral Video : ఓవైపు రోడ్డు వేస్తుంటే.. మరోవైపు సిమెంట్ మాల్ మొత్తం ఎత్తుకెళ్లిన గ్రామస్తులు.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఓవైపు రోడ్డు వేస్తుంటే.. మరోవైపు సిమెంట్ మాల్ మొత్తం ఎత్తుకెళ్లిన గ్రామస్తులు.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :8 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

  •  బీహార్ లోని గ్రామ ప్రజల వింత పని

  •  వీళ్లు మారరా అంటున్న నెటిజన్లు

Viral Video : మారుమూల ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవు. అది ఏ రాష్ట్రం అయినా సరే.. మారుమూల ప్రాంతానికి వెళ్లాలంటేనే సరైన రోడ్డు కూడా ఉండదు. అటువంటి గ్రామాలకు రోడ్డు వేస్తే అది కూడా సిమెంట్ రోడ్, డాంబర్ రోడ్ వస్తే ఎలా ఉంటది.. ఆ గ్రామాల ప్రజలు ఎంతో సంతోషిస్తారు కదా. పండుగ చేసుకుంటారు కదా. మా ఊరికి రోడ్డు వచ్చింది అని చెప్పుకొని తెగ సంతోషపడతారు కదా. కానీ.. ఒక ఊరిలో మాత్రం అంతా రివర్స్ అయింది. ఓ గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేస్తుంటే గ్రామస్తులు సంబురాలు చేసుకోకపోగా.. రోడ్డు సిబ్బందిని బెదిరించి మరీ.. రోడ్డు వేస్తుండగానే సిమెంట్ కలిపిన మాల్ మొత్తం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? బీహార్ రాష్ట్రంలో.

బీహార్ అనగానే అక్కడ ఇవన్నీ కామన్ అంటారా? అసలు రోడ్డు వేస్తుంటే.. రోడ్డు వేయనీకుండా మాల్ ను ఎత్తుకెళ్లడం ఎక్కడైనా చూశామా? బీహార్ లోనే ఇలాంటివి జరుగుతాయా అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రభుత్వం ఓ మారుమూల పల్లెకు రోడ్డు వేస్తోంది. జెహానాబాద్ కు సమీపంలోని ఓ గ్రామంలో రోడ్డు వేసేందుకు అధికారులు, కూలీలు వచ్చారు. సిమెంట్ రోడ్డు వేయడం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. మాల్ కూడా కలిపారు. ఇక.. మాల్ కలిపి రోడ్డు మీద మాల్ వేస్తూ రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో గ్రామస్తులంతా ఏకమై ఆ రోడ్డు మీద పడ్డారు. తమకు దొరికిన వస్తువును పట్టుకొచ్చారు. అందులో మాల్ వేసుకొని ఉడాయించారు. బకెట్స్, బొచ్చె, గిన్నెలు.. ఏది దొరికితే అది పట్టుకొని వచ్చి ఓ వైపు రోడ్డు వేసినా కూడా మాల్ ను పారలతో తవ్వి మరీ తీసుకెళ్లి ఇంటి దగ్గర వేసుకొని మళ్లీ వచ్చారు. మళ్లీ వచ్చి అదే పని.

Viral Video : అధికారులు చెప్పినా వినలేదు

అక్కడి అధికారులు అలా చేయకూడదు, వద్దు అని వారించినా కూడా వాళ్లు వినలేదు. గ్రామస్తులంతా ఏకం కావడంతో అధికారులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసి తిరిగి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆ మాల్ ను మొత్తం మాయం చేసి రోడ్డు లేకుండా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీహార్ ను బాగు చేయాలని ఎవరు చూసినా.. బీహార్ ప్రజలే బాగు చేయనీయరు.. అంతే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది