Karnataka Politics : ముఖ్యమంత్రి ఎవరైనా ఉప ముఖ్యమంత్రి మాత్రమే ఈయనే? కర్ణాటకలో రాజకీయ ట్విస్ట్..!
Karnataka Politics : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అధికారంలో ఉన్న బీజేపీని తరిమికొట్టేసిన ఘనత కాంగ్రెస్ ది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. అంటే సౌత్ ఇండియా నుంచి బీజేపీ ప్రస్తుతానికి ఔట్ అయినట్టే అని భావించాలి. నార్త్ ఇండియాలో ఉన్నంత బీజేపీ ప్రాబల్యం.. సౌత్ ఇండియాలో లేదనే చెప్పుకోవాలి.
ఇక.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల.. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి.. ఎవరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి.. మంత్రుల పదవులు ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కర్ణాటకలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని పలువురు అంటున్నారు. రెడ్డి సామాజిక గురువు వేమనానంద స్వామీజీ కూడద అదే చెప్పారు.
Karnataka Politics :మహా యోగి వేమన విద్య సంస్థల ఆవరణలో మాట్లాడిన స్వామీజీ
12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు గతంలో బీజేపీ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవి వచ్చింది. అది యడ్యూరప్ప సమయంలో. ఎప్పుడైతే బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు రెడ్లకు ఎలాంటి అవకాశం కల్పించలేదని.. కానీ.. ఆసారి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న రామలింగారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వామీజీ సూచించారు.