మోడీ కి వ్యతిరేకంగా సమావేశం – జగన్ ని ఆహ్వానిస్తే ఏమన్నాడంటే !
Ys Jagan దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఆయన అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కరోనా విపత్తు సమయంలో పూర్తిగా విఫలం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి దేశ ప్రధానిగా వచ్చే దఫా ఆయన వస్తాడన్న నమ్మకం చాలా మందిలో లేదు. ఈ సమయంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొందరు ముఖ్యమంత్రులు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మీటింగ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆధ్వర్యంలో జరుగబోతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
తెలుగు సీఎంలు వ్యతిరేకం..
ప్రధాని మోడీకి తెలుగు సినిమాలు కొంచెం దూరం కొంచెం దగ్గర అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు సీఎంలు కూడా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసింది లేదు. కాని కొన్ని సందర్బాల్లో ప్రధాని మోడీకి మద్దతుగా వీరిద్దరు కూడా నిలిచారు. కొన్ని సార్లు వ్యతిరేకించారు. కరోనా విపత్తు సమయంలో మోడీ చేస్తున్న కార్యక్రమాలు మరియు కొన్ని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
సీఎంల మీటింగ్ ఉద్దేశ్యం..
తెలుగు సీఎంలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్న సమావేశంలో పలు కీలక విషయాలను చర్చించబోతున్నారు. రాష్ట్రాల నుండి తీసుకుంటున్న పన్నులో కనీసం సగం అయినా తిరిగి రాష్ట్రాలకు ఇవ్వక పోవడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల పైనే ఎక్కువ శ్రద్ద పెట్టడం వంటివి కూడా చేస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనేది ఈ మీటింగ్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనే మూడవ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. కాని అవి సక్సెస్ కాలేదు. మరి ఈసారి అయినా ముందు పడేనా చూడాలి. ఎన్నికలకు ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ఉంది. కనుక ఇప్పట్లో రాజకీయ ప్రకంపణలు ఏమీ జరుగక పోవచ్చు అంటున్నారు.