బీ అలర్ట్.. నెల్లూరులో భారీగా కొవిడ్ కేసులు..!
కొవిడ్ కేసులు త్వరలో బాగా పెరిగే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఫస్ట్, సెకండ్ వేవ్ ఆల్రెడీ పూర్తి కాగా ప్రస్తుతం వచ్చే థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అంటున్నారు. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి.
మృతులు తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఇకపోతే వైరల్ ఫీవర్, కరోనా మధ్య తేడా గమనించాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చిన రెండు రకాల టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.