Nellore.. అలరిస్తున్న మాస్క్ గణేశుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nellore.. అలరిస్తున్న మాస్క్ గణేశుడు

 Authored By praveen | The Telugu News | Updated on :11 September 2021,5:08 pm

దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రజలు గణనాథుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. జిల్లాలోని సంగం మండల కేంద్రంలోని శివాజీ సెంటర్‌లో వినాయక చవితి వేడుకలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి మాస్కు ధరించి చేతిలో శానిటైజర్ బాటిల్ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ మస్ట్‌గా యూజ్ చేయాలని గణనాథుడి సూచిస్తున్నట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి విగ్రహాన్ని చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా మాస్కు గణేశుడిని చూసేందుకుగాను తరలి వస్తున్నారు.

ఇకపోతే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు మస్టుగా ధరించాలని సూచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండగా, ఆ జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమై పలు చర్యలు చేపడుతున్నారు.

 

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది