Anandaiah : అనందయ్య కొత్త పార్టీ.. ఆయన్ను నడిపిస్తుంది ఎవరు..?
Anandaiah : కరోనా విపత్కర పరిస్థితుల్లో ట్రీట్‌మెంట్ అందక, ఆక్సిజన్ సిలిండర్స్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. వెంటిలేటర్‌పై ఉండి చాలా రోజులు చికిత్స పొందిన తర్వాత కూడా కొందరు సాధారణ పరిస్థితికి రాక పరిస్థితి విషమించి చనిపోయారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మందులు కాకుండా ఆయుర్వేద మందు అందించి కరోనాను నయం చేశారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య. ఈ క్రమంలో ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ సర్కారు కూడా అనుమతించింది.కొవిడ్ సేకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నంకు తరలివచ్చారు. కరోనాను నయం చేసే మందు సప్లై చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆనందయ్య ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది.
బీసీల్లోని అన్ని కులాలను ఐక్యం చేసి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. అయితే, ఈ ఆలోచన ఆనందయ్యది కాదని, ఆయన్ను కావాలనే కొందరు రాజకీయాల్లోకి బలవంతంగా దించుతున్నారని స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల నుంచి వినబడుతోంది. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఆనందయ్య బరిలో ఉంటారని సమాచారం. అయితే, కేవలం ఒకే ఒక నియోజకవర్గం కోసం రాజకీయ పార్టీ పెట్డం సాధ్యమేనా? అసలు ఆనందయ్యకు ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుందని మరికొందరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 2020 వరకు ఆనందయ్య అంటే ఎవరికి తెలియదని, కరోనా వల్ల ఆయన పేరు మార్మోగిందని జనం అనుకుంటున్నారు. ఇకపోతే ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య విమర్శలు చేసినట్లు జనం చర్చించుకుంటున్నారు.
Anandaiah : నియోజకవర్గం కోసమే ఆనందయ్య రాజకీయ పార్టీ.. !
సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్యకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అండగా ఉన్నారు. ఈ క్రమంలో ఆనందయ్య ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటే వారు ప్రత్యర్థులుగా మారుతారు. ఇకపోతే కొద్ది రోజుల కిందట యాదవ సామాజికవర్గానికి చెందిన ఆనందయ్య ప్రజల ప్రాణాల కోసం మందు కనిపెట్టినందుకు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే, ఆ హడావిడి కొద్ది రోజులు కనబడి మళ్లీ సద్దుమణిగింది.