Nellore..గర్భిణులకు పౌష్టికాహారం కీలకం

బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం కీలకమని వెంకటాచలం ఐడీసీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఉదయ లక్ష్మి అన్నారు. వాళ్లు ఆకు కూరలు, పండ్లతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉదయ లక్ష్మి పొట్టెంపాడు గ్రామ పంచాయతీ అంగన్ వాడీ సెంటర్‌లో నిర్వహించబడుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు ఐరన్ ఉన్న ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

Advertisement

Advertisement

బాలింతలు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. స్థానిక అంగన్ వాడీలో అందజేయబడుతున్న ఆహార పదార్థాలను గర్భిణులు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. అంగన్ వాడీ టీచర్స్ సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. స్థానిక ఆశా వర్కర్ సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు. ఈ మాసోత్సవాల్లో స్థానిక గ్రామం పంచాయతీ సర్పంచ్ పార్లపల్లి అనిత, గ్రామ సచివాలయం కన్వీనర్, సూపర్ వైజర్ లలితాంబ, అంగన్ వాడీ టీచర్స్ రాజేశ్వరి, కౌసల్య, గీతాదేవి, మాధవి పాల్గొన్నారు.

 

 

 

Advertisement