Nellore..నేటి నుంచి పౌరాణిక నాటక ప్రదర్శనలు షురూ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nellore..నేటి నుంచి పౌరాణిక నాటక ప్రదర్శనలు షురూ

 Authored By praveen | The Telugu News | Updated on :8 September 2021,10:39 am

జిల్లాలో ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్నాటి మస్తానరావు తెలిపారు. మల్లు సుబ్బారెడ్డి సౌజన్యంతో నలువరాణి నాట్యమండలి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘భక్త చింతామణి, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర వారణాసి, కాటిసీను’ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మస్తానరావు మాట్లాడుతూ సమాజాన్ని తట్టి లేపే కళను ఆదరించేవారు ఇంకా ఉన్నారని చెప్పారు. నేడు ఆధునిక ప్రపంచ పోకడలు శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇంకా ప్రాచీనమైన కళలను ఆదరించేవారున్నారని వివరించారు.

ఇకపోతే పౌరాణిక నాటక ప్రదర్శనలకుగాను హార్థికంగా, ఆర్థికంగా సాయం చేస్తున్న మల్లు సుబ్బారెడ్డిని అభినందించారు. ఉచితంగానే పౌరాణిక నాటక ప్రదర్శనలు వీక్షించొచ్చని, ఈ నేపథ్యంలో ప్రజలు తరలిరావాలని కోరారు. కళాకారులు, కళాభిమానులు, ప్రజలు కళలు ఎక్కడున్నా తమ గుండెల్లో పెట్టుకుంటారని, నాటక ప్రదర్శనలకు వచ్చి వాటిని జయప్రదం చేయాలని కోరారు. పౌరణిక నాటికలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది