Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]
Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న మళ్లీ పసిడి ధరలు తగ్గాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి.
ఒక గ్రాము బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.4795 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5231 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,060 కాగా… 24 క్యారెట్లకు రూ.52,430 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,950 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,310 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో కూడా అదే ధర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.62.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.622 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.680 కాగా.. కిలో వెండి ధర రూ.68000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.622 కాగా.. కిలో వెండి ధర రూ.62200 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.680 కాగా.. కిలో వెండి ధర రూ.68000 గా ఉంది.