Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.46,950 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ.4695 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51210 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ.5121 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ లో రూ.46,950 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,210 గా ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు రూ.46,950 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,210 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,950 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,210 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. అవి కూడా భారీగా తగ్గాయి. వారం క్రితం కిలో వెండి ధర రూ.64,700 గా ఉండేది. కానీ.. ఇవాళ రూ.63 వేలుగా ఉంది. అంటే.. వారం క్రితం ధరతో పోల్చితే రూ.1700 తగ్గింది. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57.20 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.572, కిలో వెండి ధర రూ.57,200 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా.. కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా.. కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
This website uses cookies.