Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. బంగారం కొనాలంటే నేడు గగనంగా మారింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతూ వెళ్తున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఒకప్పుడు శుభకార్యాల్లో బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించేవారు కాదు కానీ నేడు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం.. ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 May 2022,9:00 am

Today Gold Rates : ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. బంగారం కొనాలంటే నేడు గగనంగా మారింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతూ వెళ్తున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఒకప్పుడు శుభకార్యాల్లో బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించేవారు కాదు కానీ నేడు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం.. ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కొన్ని రోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టినా.. బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

దేశవ్యాప్తంగా బంగారం ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము బంగారం 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.4720గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఒక గ్రాముపై రూ.45 పెరిగింది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.47,200గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.450 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే.. ఒక గ్రాము ధర రూ.5149గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.49 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.490 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,350 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,750 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు బంగారం ధర రూ.47,200 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా పెరిగాయి. ఒక గ్రాముకు రూ.60.80 ధర ఉంది. ఒక గ్రాముకు నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు పెరిగింది. 10 గ్రాములకు రూ.608 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 పెరిగింది. కిలో బంగారానికి రూ.60,800 ఉండగా.. రూ.400 పెరిగింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.650 కాగా.. కిలో వెండి ధర రూ.65 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాములకు రూ.608 కాగా.. కిలో వెండి ధర రూ.60,800 గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాములకు రూ.650 కాగా.. కిలో వెండి ధర రూ.65000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది