Tirumala Laddu Prasadam : సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదం.. దీని కారకులు ఎవరు..?
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది. భక్తితో అక్కడికి వెళ్లిన అందరికీ మంచి జరుగుతుందని భావిస్తారు. ఐతే తిరుమల స్వామి వారికి టీటీడీ బోర్డ్ కార్యకలాపాలను చూస్తుంది. ఐతే కొత్తగా తిరుమల లడ్డూ వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. లడ్డూ తయారీలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు వాడారని ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమార రేపాయి. భక్తుల్లో కూడా […]
ప్రధానాంశాలు:
Tirumala Laddu Prasadam : సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదం.. దీని కారకులు ఎవరు..?
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది. భక్తితో అక్కడికి వెళ్లిన అందరికీ మంచి జరుగుతుందని భావిస్తారు. ఐతే తిరుమల స్వామి వారికి టీటీడీ బోర్డ్ కార్యకలాపాలను చూస్తుంది. ఐతే కొత్తగా తిరుమల లడ్డూ వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. లడ్డూ తయారీలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు వాడారని ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమార రేపాయి. భక్తుల్లో కూడా ఒకరమైన ఆందోళన మొదలైంది.
ఐతే చంద్రబాబు వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారు. ఐతే దీనిపై లాబ్ రిపోర్ట్ కోసం చూడగా అందులో కూడా షాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. తిరుమల లడ్డూలో జంతువిల కొవు తో పాటు అభ్యంతరకరమైన పదార్ధాలు ఉన్నాయని లాబ్ రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు శ్రీవారి ప్రసాదం నాణ్యత మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఉన్నట్టుగా రుచి, సువాసన లేదని ఆరోపణలు వచ్చాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ లడ్డూ నాణ్యతను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేశారు.
Tirumala Laddu Prasadam లడ్డూతో పాటు అన్న ప్రసాదాల నాణ్యత..
లడ్డూతో పాటు అన్న ప్రసాదాల నాణ్యత తగ్గడానికి కూడా నెయ్యి నాణ్యత లేనిది వాడటమే అని తెలుస్తుంది. లడ్డూ వివాదంపై సీబీఐ తో విచారణ చేయించాలని హైకోర్ట్ కి వెళ్లింది వసీపీ. నెయ్యి సరఫరా లో మార్పు దీనికి కారణమని తెలుస్తుంది. గుజరాత్ లోని ఎన్.డీ.డీ.బీకి చెందిన లాబ్ కు ఈ నెయ్యి శాంపిల్ ని పరీక్షలకు పంపించారు. తమిళనాడుకి చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీ కల్తీ ఉన్నట్టు నివేదిక తేచింది. ఐతే అప్పటి నుంచి తమిళ నాడు నుంచి నెయ్యి సరఫరా ఆపేశారు. మిగతా సంస్థలను నాణ్యత పాటించాలని హెచ్చరించారు.
ఆ తర్వాత నందినీ కంపెనీ నెయ్యిని తిరుమలలో వాడుతున్నారు. ఐతే 2023 నుంచి నందిని నెయ్యి ఆపేశారు. కె.ఎం.ఎఫ్ వంటి సంస్థను పక్కన పెట్టడంతో తప్పక నాసిరకం నెయ్యి లడ్డూలకు వాడుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి చెప్పారు. మరి ఈ అపచారంపై విచారణ చేపట్టి బాధ్యులకు తగిన శిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు.