Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 May 2022,9:00 am

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ కొన్ని రోజులు తగ్గాయి. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

2022 april 22 today gold rates in telugu states

2022 april 22 today gold rates in telugu states

దేశ వ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4625 గా ఉంది. 10 గ్రాములకు రూ.46,250 గా ఉంది. నిన్న, మొన్న కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5045 గా ఉంది. 10 గ్రాములకు రూ.50450 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.47,440 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,740 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,250 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,450 గా ఉంది.

వెండి ధరలు చూస్తే.. దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.59.40 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.594 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,400 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.645 కాగా.. కిలో వెండి ధర రూ.64500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాములకు రూ.594, కిలో వెండి ధర రూ.59400గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.645 కాగా.. కిలో వెండి ధర రూ.64500గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.645 కాగా.. కిలో వెండి ధర రూ.64500గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.645, కిలో వెండి ధర రూ.64500 గా ఉంది. విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.645 కాగా.. కిలో వెండి ధర రూ.64500 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది