Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి...!
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే ఎనర్జీ పెంచే ఆహారాలను తీసుకోవడం వలన ఉల్లాసంగా మరియు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆఫీస్ పనులు చేసేవారు మరియు గట్టి పనులు చేసేవారు వీటిని తీసుకోవడం వలన శరీరానికి ఎంత శక్తి లభిస్తుంది. దీని వలన మీరు ఎంతో బలంగా మరియు దృఢంగా ఉంటారు. అంతేకాక చిన్న పిల్లలకు కూడా ఈ ఎనర్జిటిక్ బార్స్ ఇవ్వటం వలన కూడా వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఎనర్జీ పెంచే బార్స్ ని ఎంతోమంది బయట కొంటూ ఉంటారు. దాని కంటే వాటిని ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ కూడా లభిస్తాయి.
అయితే వీటిని ఉదయాన్నే తీసుకోవటం వలన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి.ఎనర్జీ బార్ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు : ఎండు ఖర్జూరం, బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు,వాల్ నట్స్, వేరుశనగపప్పు,ఉప్పులేని పిస్తా పప్పు, తేనె,యాలకుల పొడి, ఓట్స్,గుమ్మడి గింజలు. ఎనర్జీ బార్ తయారీ విధానం : ముందుగా ఎండు ఖర్జూరాలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీటిలో నానబెట్టుకోవాలి. వీటిని కనీసం 1గంట సేపైనా నానబెట్టాలి. తర్వాత ఖర్జూరంలోని విత్తనాలను తీసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయిలో ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేయించుకోవాలి. కావాలనుకునేవారు ఎండు కొబ్బరిని కూడా వేయించి తీసుకోవచ్చు.
ఇప్పుడు వాటన్నిటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దాని తర్వాత అదే కడాయిలో ఓట్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కళాయిని తీసుకొని దానిలో ఖర్జూరం పేస్ట్ ను వేసి దానిలో నీరు ఇంకిపోయి చిక్కబడే వరకు వేయించాలి. తర్వాత దీనిలో యాలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనే కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఓట్స్ పోడి కూడా వేసుకోవాలి. దీనిలో పంచదార వెయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా ట్రై లో తీసుకోవాలి. ఇప్పుడు వాటిని కట్ చేసుకొని పైన మూత పెట్టేసి ఫ్రిజ్ లో గంటసేపు ఉంచాలి. అంతే ఎనర్జీ బార్స్ తయారైనట్లే…