Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 July 2022,9:00 am

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.4630 గా ఉంది. ఒక గ్రాము ధరపై నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.46,300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5051 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.12 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,510 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.120 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,580 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,810 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.46,300 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.50,510 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,350 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.55.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు తగ్గింది. వెండి దరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల వెండి ధర రూ.556 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో వెండి ధర రూ.55,600 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.556 కాగా.. కిలో వెండి ధర రూ.55600 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా.. కిలో వెండి ధర రూ.60700 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది