Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలెంతో తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలెంతో తెలుసా..!

Today Gold Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వస్తోంది. మూడు రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన పసిడి ధరల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పలు చోట్ల మార్పు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమక్రమంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ రాగా నిన్న ఆయా ప్రాంతాల్లో మళ్ళీ పెరుగుదల దిశగా వెళ్ళగా… నేడు కూడా ఆయా ప్రదేశాల్లో మరి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :8 February 2022,8:20 am

Today Gold Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వస్తోంది. మూడు రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన పసిడి ధరల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పలు చోట్ల మార్పు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమక్రమంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ రాగా నిన్న ఆయా ప్రాంతాల్లో మళ్ళీ పెరుగుదల దిశగా వెళ్ళగా… నేడు కూడా ఆయా ప్రదేశాల్లో మరి కాస్త పెరిగాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆ

భరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 300 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 250 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 300 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49, 300 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.

2022 february 08 today gold rates in telugu states

2022 february 08 today gold rates in telugu states

దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులలోనూ వెండి ధరలు రూ. 100 తగ్గాయి. ఆయా చోట్ల కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 64, 900 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది