Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పసిడి, తగ్గిన వెండి ధరలు.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పసిడి, తగ్గిన వెండి ధరలు.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 May 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం పేరు ఎత్తితేనే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజుల్లో వెండిని కూడా కొనలేము. బంగారం, వెండి రెండు కాస్ట్ లీ అయిపోయాయి. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులు ఒక కారణం అయితే.. ప్రస్తుతం బంగారం కోసం పెరుగుతున్న డిమాండ్ కూడా మరో కారణం ధరలు పెరగడానికి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. నిన్న కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. కానీ.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఎంత పెరిగాయో, తగ్గాయో తెలుసుకుందాం రండి.

2022 april 12th today gold rates in telugu states

2022 april 12th today gold rates in telugu states

దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధర 22 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.4670 గా ఉంది. ఒక గ్రాము మీద నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 10 గ్రాములకు రూ.46,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5095 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 పెరిగింది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 10 గ్రాములకు రూ.440 పెరిగింది. నిన్న 24 క్యారెట్లకు రూ.50,510 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలోని మెట్రో సిటీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.47,860 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,210 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,700 గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.50,950 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,700 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,950 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,700 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,950 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,700 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,950 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.46,700 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.50,950 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,700 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.50,950 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల ధర రూ.46,700 కాగా… 24 క్యారెట్ల ధర రూ.50,950 గా  ఉంది.

దేశవ్యాప్తంగా వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాము వెండి ధర రూ.61.70 గా ఉంది. అంటే నిన్నటి ధరతో పోల్చితే రూ.3.30 తగ్గింది. నిన్న వెండి ధర ఒక గ్రాముకు రూ.65 ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.617 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.33 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3300 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.659గా ఉంది. కిలో వెండి ధర రూ.65900 గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900గా ఉంది. విశాఖపట్టణంలో 10 గ్రాములకు రూ.659 కాగా.. కిలో వెండి ధర రూ.65900గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది