Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 June 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి.

24 april 2022 today gold rates in telugu states

3 june 2022 today gold rates in telugu states

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.47,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5193 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,930 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,100 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,930 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,930 గా ఉంది. కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.61.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 80 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.614 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.8 పెరిగింది. కిలో వెండి ధర రూ.61,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.800 పెరిగింది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.614 కాగా.. కిలో వెండి ధర రూ.61400 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా.. కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది