Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 May 2022,9:00 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాలి. ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు జనాలు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా శుభకార్యాలకు అంతో ఇంతో బంగారాన్ని కొనుక్కునే వారు. కానీ.. పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వరుసగా పెరుగుతూ వెళ్తున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4786 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 10 గ్రాముల బంగారానికి రూ.47,860 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5221 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూపాయి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,960 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,320 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా… 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం రూ.47,860 కాగా 24 క్యారెట్ల బంగారం రూ.52,210 గా ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.62,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది