Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!
ప్రధానాంశాలు:
Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం... ఎలాగో తెలుసా...!
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని బారిన పడుతున్నారు. అయితే శరీరంలో మధుమేహ లక్షణాలు మొదలవగానే ఏం తినాలి ఏం తినకూడదు అని చాలామంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఆహారంతో పాటుగా ఆహారం తిన్న తర్వాత కూడా ఏం చెయ్యాలో తెలిసి ఉండాలి. అయితే రక్తంలో చక్కెర ను తగ్గించడానికి వాము సరైన ఔషధం అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ఆహారం తిన్న తర్వాత కొద్దిగా వామును నోట్లో వేసుకుంటే షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది అని అంటున్నారు…
వాములో ప్రోటీన్ మరియు ఫ్యాట్, పీచ్, కార్బోహైడ్రేట్స్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉన్న పీచు శరీరంలో ఉన్న చక్కెరను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ వామును రోజు ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి వాము ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వామును తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు అంటే వాము లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిలో ఉన్న ఫైబర్ అనేది రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మీ డైట్ లో వామును చేర్చుకోవడం వలన షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది…
వామును నిత్యం మీ ఆహారంలో భాగం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వాము వేసుకొని బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిని వడపోయాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన 40 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా నిత్యం కచ్చితంగా చేయటం వలన శరీరంలో బ్లడ్ షుగర్ అనేది అదుపులో ఉంటుంది. అలాగే వామును రోజు తీసుకోవడం వలన బరువు కూడా తగ్గుతారు. అయితే డయాబెటిస్ ఉన్నప్పుడు బాడీలో మెటబాలిజం సరిగ్గా ఉండదు. అయితే మెటబాలిజం వేగం అనేది తగ్గితే బరువు కూడా పెరుగుతారు. ఇటువంటి పరిస్థితులలో వామును ఆహారంలో చేర్చుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మేటబాలిజం వృద్ధి చెందుతుంది…