Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]
Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న, నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ.. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4810 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5247 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.13 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,470 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.130 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,130 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉంది. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.58.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.10 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.589 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 పెరిగింది. కిలో వెండి ధర రూ.58,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.1100 పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.647 కాగా.. కిలో వెండి ధర రూ.64700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.589 కాగా.. కిలో వెండి ధర రూ.58900 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.647 కాగా.. కిలో వెండి ధర రూ.64700 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.