Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates :  ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 July 2022,9:00 am

Today Gold Rates :  ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ.. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

24 april 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4760 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5193 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.54 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,930 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.540 తగ్గింది.

Today Gold Rates :  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు 47,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,930 గా ఉంది. ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.51,930 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.47,630 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,960 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రెండు రూపాయలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.569 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,900 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.2000 తగ్గింది.

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.569 కాగా.. కిలో వెండి ధర రూ.56900 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది