7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3 శాతం డీఏ పెంపు.. భారీగా పెరగనున్న జీతాలు?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. గత జూన్ లోనే పెరగాల్సిన డీఏ ఇంకా పెరగలేదు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెరుగుతుంది. గత జనవరిలో పెరగాల్సిన డీఏను మార్చిలో పెంచారు. 4 శాతం పెంచారు. జనవరి నుంచి బకాయిలు కూడా చెల్లించారు. కానీ.. జూన్ లో పెరగాల్సిన డీఏ ఇంకా పెరగలేదు. దీంతో డీఏ పెంపు కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 38 శాతంగా ఉన్న డీఏ ప్రస్తుతం 42 శాతంగా మారింది. ఇప్పుడు కూడా మరో 4 శాతం డీఏ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు.
కానీ.. డీఏ ఈసారి 3 శాతమే పెరగనుందట. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. అయినా కూడా ఈసారి 4 శాతం కాకుండా 3 శాతమే డీఏ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నిజానికి.. డీఏను సీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ప్రకారం పెంచుతారు. జూన్ 023కి సంబంధించిన ఇండెక్స్ జులై 31, 2023న రిలీజ్ అయింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏను 4 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కానీ.. డీఏను 3 శాతం వరకే పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.
7th Pay Commission : 45 శాతం ఫిక్స్?
ఈసారి కూడా 4 శాతం పెరిగితే 46 శాతం డీఏ అయ్యేది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరిగేవి. కానీ.. ఈసారి 3 శాతమే పెంచి దాన్ని 45 శాతానికి ఫిక్స్ చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రస్తుతం డీఏ, డీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోటి మందికి 42 శాతం డీఏ లభిస్తోంది. ప్రతి సంవత్సరం డీఏ, డీఆర్ ను రెండు సార్లు పెంచుతారు అని తెలుసు కదా. ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో డీఏను పెంచారు.