7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎచ్ఆర్ఏ పెంచనుందా..? ఎంప్లాయిస్ కి కొంత రిలీఫ్..
7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ డీఏ పెంపు శుభవార్త ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే… పెంచిన డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను జనవరి 2022 నుంచే అమల్లోకి తెచ్చింది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 3 శాతం పెంచాలని నిర్ణయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. డీఏను ఉద్యోగి బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ అలవెన్స్‌లను పెంచింది. అదేవిధంగా డీఏ పెంపుతో పాటు పెన్షనర్లకు డీఆర్‌ను కూడా పెంచింది.
ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఉద్యోగులపై భారం పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. పెంచిన 3 శాతం డీఏ ప్రతి నెలా ఉద్యోగుల వేతనంలో యాడ్ అవుతుందని తెలిపింది. అదేవిధంగా ప్రతి నెలా పెన్షనర్లు పొందే పెన్షన్‌లో కూడా ఈ మొత్తాన్ని యాడ్ చేస్తామని పేర్కొంది.సాధారణంగా డీఏ పెరిగితే మిగిలినవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతోంది. అయితే హెచ్ఆర్ఏను చివరిగా ఏడాది కిందట పెంచింది. మళ్లీ ఇప్పుడు హెచ్ఆర్ఏ పెంచితే శాలరీ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు వల్ల చాలా మందికి రిలీఫ్ కలగనుంది. హెచ్‌ఆర్ఏ రేట్లు ప్రస్తుతం 27 శాతం, 18 శాతం, 9 శాతంగా ఉన్నాయి. ఉద్యోగులు వారి కేటగిరి ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక హెచ్ఆర్ఏను పొందుతారు.
ఈ రేట్లని పెంచాలని కేంద్రం అనుకుంటోంది. ఇక ఇది ఇలా ఉంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఈసారి 3 శాతం మేర పెంచచ్చనే అంటున్నారు. అంటే ఎక్స్ కేటగిరిలోని వారికి పెంపు 3 శాతంగా ఉండొచ్చు. అలాగే వై కేటగిరి లోని వారికి హెచ్ఆర్ఏ పెంపు 2 శాతంగా పెరిగే ఛాన్స్ వుంది. జెడ్ కేటగిరి లోని ఉద్యోగులకు 1 శాతం మేర పెరగొచ్చు.ఈ మార్పు వచ్చాక హెచ్ఆర్ఏ 30 శాతంగా, 20 శాతంగా, 10 శాతంగా ఉండనున్నాయి. మినిమమ్ హెచ్ఆర్ఏ 10 శాతంగా ఉంటుంది. ఎక్స్ కేటగిరిలో ఉన్న ఉద్యోగులకు వారి బేసిక్ శాలరీలో 27 శాతం మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద అందిస్తారు. వై కేటగిరి అయితే 18 శాతం, జెడ్ కేటగిరిలో ఉన్న వారికి 9 శాతం హెచ్‌ఆర్ఏ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని అంటున్నారు.