7th Pay Commission : గుడ్ న్యూస్ చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం.. డీఏ 6 శాతం పెరిగే అవ‌కాశం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7th Pay Commission : గుడ్ న్యూస్ చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం.. డీఏ 6 శాతం పెరిగే అవ‌కాశం

 Authored By sandeep | The Telugu News | Updated on :24 July 2022,6:00 pm

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ 5 నుంచి 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ ప్రయోజనం పొందవచ్చు. ఒకటిన్నర సంవత్సరాల కు పైగా డిఏ బకాయిలు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ఆగస్టు 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెరగుద‌ల‌పై నిర్ణ‌యం రానుంది.

ఇంతకుముందు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను సుమారు 5 శాతం పెంచవచ్చని భావించారు. అయితే అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ పెరుగుదల 5 శాతానికి బదులుగా 6 శాతం ఉండే అవకాశం ఉంది. బకాయిలపై ఉద్యోగులు, పెన్షనర్లు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరగా తమ బకాయిలు చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం డీఏ ఇస్తోంది. 2021 నుంచి ప్రభుత్వం డీఏను మొత్తం 11 శాతం పెంచింది. అంటే మార్చి 2022లో 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది. ఇప్పుడు 5 శాతం పెంచితే డీఏ 39 శాతానికి చేరుకుంటుంది.

7th pay commission modi government employees will get hike in DA is likely to increase by 6 percent

7th pay commission modi government employees will get hike in DA is likely to increase by 6 percent

7th Pay Commission : గుడ్ న్యూస్..

ఈ ప్రయోజనం 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు చేకూరనుంది.దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా 7 శాతం పైన ఉండగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 15 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఇక ఈ అప్రైజల్ అసెస్మెంట్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పినట్టయ్యింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది