Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 July 2022,9:00 am

Today Gold Rates : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. బంగారం కంటే విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ.. బంగారానికి ఉన్న డిమాండే వేరు. బంగారాన్ని ఎక్కువగా ఆభరణాలుగా చేసుకొని మెడలో వేసుకోవడానికి మహిళలు ఇష్టపడతారు. మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ. అదే.. దానికి ఎక్కువ డిమాండ్ వచ్చేలా చేసింది. పెళ్లి అయినా.. బారసాల అయినా.. పెద్దమనిషి ఫంక్షన్ అయినా ఇంట్లో ఏ శుభకార్యం అయినా అక్కడ ఎక్కువగా మాట్లాడుకునేది బంగారం గురించే. మహిళలు ఏ శుభకార్యానికి వెళ్లినా.. మెడలో బంగారం వేసుకోకుండా మాత్రం వెళ్లరు. ఒకప్పుడు బంగారానికి ఇంత డిమాండ్ లేదు.. అంత కాస్ట్ లీ కూడా కాదు. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కొన్ని రోజులు స్వల్పంగా తగ్గినా.. మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ స్థిరంగా ఉన్నాయి.

08 May 2022 today gold Rates in Telugu states

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఇవాళ రూ.4685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5111 గా ఉంది. 10 గ్రాముల బంగారం రూ.51,110 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,720 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,970 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఈరోజు రూ.56.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. వెండి ధరలు కూడా ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల వెండి ధర ఇవాళ రూ.569 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.56,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.625 కాగా.. కిలో వెండి ధర రూ.62500 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది