Cool Drink : చిన్నారి ప్రాణం తీసిన కూల్ డ్రింక్ .. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమా ..??
Cool Drink : అప్పటిదాకా తన స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చిన ఒక చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి మృతి చెందిన విషాద ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో విషాదం నెలకొంది. పెంటయ్య లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. తల్లిదండ్రులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. కరుణ కుమారి తన స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటుంది. దాహం వేసి ఇంటికి వచ్చి చూసింది. ఇంట్లో ఒక మూలన కూల్ డ్రింక్ బాటిల్లో పురుగుల మందు పోసి పెట్టారు తల్లిదండ్రులు.
అయితే ఆ విషయం పాపకు తెలియక కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగింది. అప్పటివరకు బాగానే ఉన్నా కరుణకుమారి ఒక్కసారిగా కడుపునొప్పి అంటూ కుప్పకూలిపోయింది. కూతురికి ఏమైందో తెలియక తల్లిదండ్రులు కంగారుపడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమించడంతో వైద్యులు పాపను విశాఖపట్నం పంపించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కరుణ కుమారి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా విలపించారు. అయ్యో తల్లి నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అంటూ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ ఘటన అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ చిన్నారి మరణం తో ఆ గ్రామ ప్రజలంతా కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రుల పొరపాటు వలన ఆ చిన్నారి కూల్డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగి మరణించింది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి.