ఏపీ మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు సంచలన నిర్ణయం?
ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. మూడు రాజధానుల ప్రకటన రాగానే.. కొందరు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అమరావతి రైతులు ఒకటే రాజధాని ఉండాలంటూ ఇప్పటికీ దీక్ష చేస్తున్నారు. మరోవైపు కొందరు మూడు రాజధానులపై హైకోర్టుకు ఎక్కారు.
చాలా రోజుల నుంచి ఏపీ హైకోర్టులో మూడు రాజధానులకు సంబంధించిన కేసుల విచారణ సాగుతోంది. కానీ.. ఆ బిల్లుకు సంబంధించి ఏదీ కొలిక్కి రాలేదు.
దీంతో.. మూడు రాజధానుల అంశంపై దాఖలు అయిన సుమారు 90 పిటిషన్ల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.
అయితే.. ఇప్పటికే… ఆ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్లను విచారించిన కోర్టు.. ప్రభుత్వం తరుపున వాదనలను ప్రస్తుతం వింటోంది.
ఏపీ ప్రభుత్వం తరుపున.. సుప్రీం సీనియర్ లాయర్ దుష్యంత్ దేవ్ ఈ బిల్లుపై వాదిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు రాజధానుల వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి. అభివృద్ధి ఏవిధంగా ఉంటుంది.. అనే దానిపై కోర్టుకు వివరించారు. అలాగే.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని.. మూడు రాజధానులను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వాదించారు.
ఏపీ అభివృద్ధి కోసం.. ప్రజల దీర్ఘకాలిక అవసరాల కోసం.. ప్రయోజనాల కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. అలాగే.. ఏపీ క్యాపిటల్ రీజిన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్టాన్ని రద్దు చేస్తూ చేసిన చట్టం వల్ల అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు పరిరక్షింపబడుతాయి… అంటూ దుష్యంత్ ప్రభుత్వ వాదనలను వినిపించారు.