Bank Loans : బ్యాంకు కస్టమర్లకు అదిరే శుభవార్త .. ఫ్రీగా లోన్స్ ..!
Bank Loans : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు అందించింది. కొత్త కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. యూపీఐ సర్వీసులను మరింతగా పెంచింది. దీంతో లోన్ తీసుకునే వారికి ఊరట కలగనుంది. తాజాగా ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. యూపీఐ తో బ్యాంక్ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ ను లింకు చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఏ సర్వీసులను మరింత విస్తరించాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో డిపాజిట్ అకౌంట్లు, వాలెట్స్ వంటి ప్రిపేయిడ్, ఇన్స్ట్రుమెంట్స్ కు యూపీఏ ట్రాన్సాక్షన్లు నిర్వహించే వెసులుబాటు ఉంది. అయితే ఇక పై బ్యాంకుల ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ కు
యుపిఎ సేవలు వర్తిస్తాయి. గతంలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ తో లింక్ చేసుకునే అవకాశం కల్పించామని, ఇప్పుడు బ్యాంకు ఫ్రీ సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ యూపీఐ సేవలు అందిస్తున్నామని శక్తి కాంత్ దాస్ వెల్లడించారు. దీనివల్ల రిటైల్ పేమెంట్స్ లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. అంటే యూపీఐ ద్వారా బ్యాంకు లోన్స్ పొందవచ్చని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త సేవలు వలన లోన్ డబ్బులు వెంటనే వస్తాయని చెప్పుకోవచ్చు. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ త్వరగా జరిగిపోతాయి. ఇక మరోవైపు ఆర్బిఐ వినియోగదారులకు శుభవార్త అందించింది. అన్ క్లేయిమ్ డిపాజిట్ ల కోసం కొత్త వెబ్సైట్ తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.
ఆన్ లైన్ డిపాజిట్లు గురించి తెలుసుకోవడానికి బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్.బి.ఐ ఇప్పుడు అన్ని బ్యాంకుల కస్టమర్లకు ఒక వెబ్సైట్ను అందుబాటులో కి తీసుకురాబోతోంది. బ్యాంకు కస్టమర్లు అందరూ డిపాజిట్లు వివరాలను ఒకే వెబ్సైట్లో ఒకే చోట పొందొచ్చు. దీనివలన చాలామందికి లాభం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రిజర్వ్ బ్యాంక్ రెపోరేటులో ఎలాంటి మార్పు లేదని చెప్పేసింది. ప్రస్తుతం 6.5% వద్దనే కొనసాగుతుంది. ఋణ గ్రహీతలకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. . అయితే డిపాజిట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. డిపాజిట్ రేట్లు కూడా పెరగకపోవచ్చు.