Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

Blood Donation : అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అంటారు పెద్దలు. ఎందుకంటే.. డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఏది కావాలన్నా దాన్ని తయారు చేసుకోవచ్చు. డబ్బు ఉంటే దేన్నయినా తయారు చేసుకోవచ్చు. కానీ.. డబ్బుతో రక్తాన్ని మాత్రం తయారు చేయలేం. రక్తం కావాలంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరైనా ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే అది ఇంకొకరికి అందుతుంది. లేదంటే రక్తం అందక ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. రక్తదానం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 June 2021,1:50 pm

Blood Donation : అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అంటారు పెద్దలు. ఎందుకంటే.. డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఏది కావాలన్నా దాన్ని తయారు చేసుకోవచ్చు. డబ్బు ఉంటే దేన్నయినా తయారు చేసుకోవచ్చు. కానీ.. డబ్బుతో రక్తాన్ని మాత్రం తయారు చేయలేం. రక్తం కావాలంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరైనా ఒకరు రక్తాన్ని దానం చేస్తేనే అది ఇంకొకరికి అందుతుంది. లేదంటే రక్తం అందక ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.

blood donation benefits health telugu

blood donation benefits health telugu

అందుకే.. రక్తదానం అన్ని దానాల కన్నా మిన్న అంటారు. రక్తదానం చేయాలంటూ నిత్యం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటారు. రక్తదానం చేసిన వాళ్లను ప్రోత్సహించడం, చేయని వాళ్లను రక్తదానం చేయాలంటూ అవగాహన కలిగించడం లాంటివి చేస్తుంటాం. రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా వివరిస్తుంటాం. కానీ.. చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు రారు. రక్తదానం అంటేనే భయపడిపోతారు. వామ్మో.. రక్తం ఇస్తే మాకేమైనా అవుతుందేమో అని భయపడిపోతుంటారు.

Blood Donation : రక్తం దానం చేయడం వల్ల లాభమే కానీ.. నష్టం ఏమాత్రం లేదు

నిజానికి రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదు. రక్తదానం చేయడం వల్ల.. రక్తం కావాల్సిన వారిని కాపాడటంతో పాటు.. తమకు తాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందిన వారు అవుతారు. రెగ్యులర్ గా రక్తదానం చేయడం వల్ల.. బరువు తగ్గడంతో పాటు ఫిట్ గా తయారవుతారు. ఒకసారి రక్తాన్ని దానం చేస్తే.. 650 కేలరీలు ఖర్చవుతాయి.

blood donation benefits health telugu

blood donation benefits health telugu

రక్తాన్ని దానం చేయడం వల్ల.. శరీరంలో వచ్చే హెమోక్రామటోసిస్ అనే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ సమస్యను కేవలం రక్తాన్ని దానం చేయడం వల్లనే తగ్గించుకోవచ్చు. నిజానికి.. రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల.. శరీరంలో ఐరన్ శాతం తగ్గుతూ వస్తుంది. శరీరంలో ఐరన్ ఎక్కువైతే.. హెమోక్రామటోసిస్ అనే సమస్య వస్తుంది. రక్తం దానం చేయడం వల్ల.. శరీరంలో ఐరన్ శాతం తగ్గడంతో.. ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Blood Donation : గుండె జబ్బులు తగ్గుతాయి

ప్రతీ మూడు నెలలకు ఓసారి రక్తాన్ని దానం చేయడం వల్ల.. గుండె జబ్బులు రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు. రక్తదానం వల్ల ఐరన్ లేవల్స్ తగ్గడంతో.. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే.. ఐరన్ ఎక్కువైతే.. ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగి.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే.. క్యాన్సర్ ముప్పు కూడా తప్పుతుంది. క్యాన్సర్ రిస్కే ఉండదు. దీనికి కూడా కారణం ఐరనే. ఐరన్ తక్కువవుతున్నా కొద్దీ.. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

blood donation benefits health telugu

blood donation benefits health telugu

అలాగే.. శరీరంలో కొత్తగా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. పాత రక్తకణాలు చనిపోయి.. కొత్తవి ఉత్పత్తి అవ్వడంతో రక్తం ఉత్తేజితం అవుతుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి కాకపోయినా.. కనీసం ఆరు నెలలకు ఓసారి రక్తాన్ని దానం చేసినా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే.. ఏమాత్ర సందేహించకుండా.. అవసరంలో ఉన్నవారికి రక్తాన్ని దానం చేసి పుణ్యాన్ని కట్టుకోండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Salt : ఉప్పు ఎక్కువగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే జన్మలో ఉప్పు ముట్టుకోరు?

ఇది కూడా చ‌ద‌వండి ==> Covid Nails : క‌రోనా మీకు వ‌చ్చి వెళ్ళింద‌ని మీ గోర్లె చెబుతాయి .. ఒక్క సారి చెక్ చెసుకొండి ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Third Wave : థర్డ్ వేవ్ వస్తే.. పిల్లలకు ప్రమాదమేనా? నిపుణులు ఏమంటున్నారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది