Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Food : అన్నం తిన్నాక ఈ పని చేశారంటే.. కోరి క్యాన్సర్ ను తెచ్చుకున్నట్టే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 June 2021,7:52 am

Food : భోజనం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక్క రోజు.. రెండు రోజులు అన్నం తినకపోతే ఓకే కానీ.. కంటిన్యూగా అన్నం తినకుండా ఉండలేం. దాని వల్ల నీరసం వస్తుంది. ఒంట్లో శక్తి ఉండదు. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. ప్రతి రోజు కనీసం రెండు సార్లు అయినా భోం చేయాలి. సాధారణంగా ఇండియాలో అయితే.. రోజుకు మూడు సార్లు తింటుంటారు. ఉదయం పూట ఏదైనా అల్పాహారం తీసుకొని.. మధ్యాహ్నం, రాత్రి పూట భోం చేస్తుంటారు. అయితే.. చాలామంది భోజనం చేసిన తర్వాత చేసే పని వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భోజనం చేసిన తర్వాత చాలామంది చేసే ఒకే ఒక తప్పు వాళ్లకు క్యాన్సర్ వచ్చేలా చేస్తోంది. ఇది ఒక్కరికో ఇద్దరికో ఉన్న అలవాటు కాదు. చాలామందికి ఉన్న అలవాటే. దీని వల్ల జీవితాలే నాశనం అవుతున్నాయి.

smoking after eating food causes cancer

smoking after eating food causes cancer

భోజనం చేయడానికి ముందు కూడా కొందరు చేసే పనుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. భోజనం చేయగానే చేసే పనుల వల్ల కూడా లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే.. వీటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏమౌతుందిలే అని అనుకుంటారు. కానీ.. మనం చేసే చిన్న తప్పుల వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మనకు చిన్నగానే అనిపిస్తుంది కానీ.. అదే ఒక్కోసారి జీవితాన్నే బలి తీసుకుంటుంది.

Food : అన్నం తిన్నాక ఈ పని అస్సలు చేయకండి

చాలామందికి మధ్యాహ్నం పూట అన్నం తినగానే సిగిరెట్ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు. అన్నం తినగానే.. పొగతాగాల్సిందే. లేదంటే వాళ్లకు తిన్న అన్నం కూడా ఒంటపట్టదు. ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కునే వాళ్లు.. ఎక్కువగా ఈపని చేస్తుంటారు. నిజానికి సిగిరెటు తాగడం వల్ల.. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. కానీ.. మామూలుగా అన్నం తినకముందు సిగిరెట్ తాగడం వేరు.. అన్నం తినగానే సిగిరెట్ తాగడం వేరు. భోజనం చేసిన వెంటనే సిగిరెట్ తాగితే.. చాలా ప్రమాదమట. క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

smoking after eating food causes cancer

smoking after eating food causes cancer

Food : ఎందుకు అన్నం తినగానే సిగిరెట్ తాగకూడదు?

అన్నం తినగానే ఎందుకు సిగిరెట్ తాగకూడదు.. అంటే.. అన్నం తినగానే.. ఆ అన్నం మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయం వెంటనే మనం తిన్న అన్నాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు చిన్న పేగుల్లో నుంచే అన్నం శోషక రూపంగా మారిపోతుంది. దాంట్లో చాలా ఎంజైమ్ లు కలుస్తాయి. మనం తిన్న ఆహారం చిన్న పేగులోనే సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంటుంది.ఈసమయంలో అన్నం తినగానే సిగిరెట్ తాగితే… తిన్న అన్నంలోని పోషకాలను గ్రహించాల్సిన చిన్న పేగు.. సిగిరెట్ లోని నికోటిన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. నిజానికి.. మనం అన్నం తినేదే.. శరీరానికి కావాల్సిన పోషకాల కోసం. కానీ.. మనం సిగిరెట్ తాగడం వల్ల.. అన్నంలోని పోషకాలను, ఇతర పదార్థాలను గ్రహించాల్సిన చిన్న పేగు.. దాన్ని వదిలేసి… సిగిరెట్ పొగలోని నికోటిన్ ను గ్రహిస్తుంది. ఆ నికోటిన్.. రక్తంలోని ఆక్సిజన్ ను బంధించేస్తుంది. దాని వల్ల.. శ్వాస సమస్యలు రావడంతో పాటు.. శరీరంలోకి ప్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. అలాగే.. క్యాన్సర్ కణాలను సృష్టిస్తాయి. దీని వల్ల పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

smoking after eating food causes cancer

smoking after eating food causes cancer

మామూలుగా సిగిరెట్ తాగడం వేరు.. అన్నం తిన్నాక సిగిరెట్ తాగడం వల్ల.. భోం చేసిన వెంటనే సిగిరెట్ తాగితే.. అది మామూలు టైమ్ లో పది సిగిరెట్లు తాగిన దానితో సమానం అట. భోజనం చేసిన తర్వాత సిగిరెట్ తాగే అలవాటు నిత్యం ఉంటే.. వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందట. అందుకే.. మీకు కూడా భోజనం చేయగానే సిగిరెట్ తాగే అలవాటు ఉంటే.. వెంటనే మానుకోండి. లేదంటే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసు కదా?

ఇది కూడా చ‌ద‌వండి==> Third Wave : థర్డ్ వేవ్ వస్తే.. పిల్లలకు ప్రమాదమేనా? నిపుణులు ఏమంటున్నారు?

ఇది కూడా చ‌ద‌వండి==> Oxygen : భార్య ఆక్సీజన్ లేక చనిపోయిందని.. భర్త చేస్తున్నా ఒక గొప్ప పని..!

ఇది కూడా చ‌ద‌వండి==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

ఇది కూడా చ‌ద‌వండి==> Tea : చాయ్ తాగుతూ ఇవి తింటున్నారా? అయితే.. మీరు ప్రమాదంలో పడ్డట్టే?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది