Broccoli : సీజన్ మారినప్పుడల్లా మనకు వచ్చే సమస్యలు అందరికీ తెలుసు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అందరికీ కామన్. ఎండాకాలం వెళ్లి వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు.. ఇక ఎన్నో ఇన్ఫెక్షన్లు మనల్ని వేధిస్తుంటాయి. గొంతు నొప్పి, దగ్గు, ఇతర వైరస్ లు మనల్ని వేధిస్తుంటాయి. ఇలా సీజన్లలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే ఎలా? ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తినాలి? ఏం తింటే.. సీజనల్ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది చెప్పే సలహా ఒక్కటే.. అదే కూరగాయలు, తాజా పండ్లు, ఆకు కూరలు. ఇవి తింటే.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అయితే.. వీటిలో బ్రకోలిని ఎక్కువగా తీసుకుంటే.. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి ఫ్లూ ఉన్నా సరే.. బ్రకోలిని తింటే చాలు.. వెంటనే అది తగ్గిపోతుంది.
బ్రకోలిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, ఈ, కే బ్రకోలిలో సమృద్ధిగా ఉండటంతో పాటు.. జింక్, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే.. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ లు సోకినా వెంటనే తగ్గుతాయి. రైనో వైరస్ వల్ల వచ్చే జలుబును వెంటనే తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్రకోలి సొంతం. అందుకే.. డాక్టర్లు కూడా బ్రకోలిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెబుతుంటారు.
బ్రకోలిలో ఇన్ని సుగుణాలు ఉంటాయి కాబట్టే.. దీనికి చాలా డిమాండ్. అయితే.. బ్రకోలి మన దగ్గర తక్కువగా పండుతుంది. దీన్ని ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి వేరే దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. మన దగ్గర కూడా దీనికి బాగానే డిమాండ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈసారి మార్కెట్ కు వెళ్లినప్పుడు బ్రకోలిని కూడా తెచ్చుకొని వెంటనే వండుకొని తినేయండి. సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.