Broccoli : బ్రకోలి హెల్త్ కు ఎంత మంచిదో తెలిస్తే.. మీరు అస్సలు ఆగరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Broccoli : బ్రకోలి హెల్త్ కు ఎంత మంచిదో తెలిస్తే.. మీరు అస్సలు ఆగరు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 June 2021,7:30 pm

Broccoli : సీజన్ మారినప్పుడల్లా మనకు వచ్చే సమస్యలు అందరికీ తెలుసు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అందరికీ కామన్. ఎండాకాలం వెళ్లి వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు.. ఇక ఎన్నో ఇన్ఫెక్షన్లు మనల్ని వేధిస్తుంటాయి. గొంతు నొప్పి, దగ్గు, ఇతర వైరస్ లు మనల్ని వేధిస్తుంటాయి. ఇలా సీజన్లలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే ఎలా? ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తినాలి? ఏం తింటే.. సీజనల్ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

broccoli health benefits telugu

broccoli health benefits telugu

సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది చెప్పే సలహా ఒక్కటే.. అదే కూరగాయలు, తాజా పండ్లు, ఆకు కూరలు. ఇవి తింటే.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అయితే.. వీటిలో బ్రకోలిని ఎక్కువగా తీసుకుంటే.. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి ఫ్లూ ఉన్నా సరే.. బ్రకోలిని తింటే చాలు.. వెంటనే అది తగ్గిపోతుంది.

Broccoli : బ్రకోలిలో ఉండే పోషకాలు ఏంటో తెలుసా?

broccoli health benefits telugu

broccoli health benefits telugu

బ్రకోలిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, ఈ, కే బ్రకోలిలో  సమృద్ధిగా ఉండటంతో పాటు.. జింక్, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే.. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ లు సోకినా వెంటనే తగ్గుతాయి. రైనో వైరస్ వల్ల వచ్చే జలుబును వెంటనే తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్రకోలి సొంతం. అందుకే.. డాక్టర్లు కూడా బ్రకోలిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెబుతుంటారు.

broccoli health benefits telugu

broccoli health benefits telugu

బ్రకోలిలో ఇన్ని సుగుణాలు ఉంటాయి కాబట్టే.. దీనికి చాలా డిమాండ్. అయితే.. బ్రకోలి మన దగ్గర తక్కువగా పండుతుంది. దీన్ని ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి వేరే దేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. మన దగ్గర కూడా దీనికి బాగానే డిమాండ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈసారి మార్కెట్ కు వెళ్లినప్పుడు బ్రకోలిని కూడా తెచ్చుకొని వెంటనే వండుకొని తినేయండి. సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపీ మీమ్మ‌ల‌ని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తిన‌డంలేద‌ని అర్ధం..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Blood Donation : రక్తదానం చేస్తే క్యాన్సర్ రాదా? రక్తదానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Proteins: ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? పోషక ఆహారం ఎక్కువైతే ఈ వ్యాధులు వస్తాయి?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది