Business Idea : ఈ బిజినెస్ చేశారంటే లక్షల ఆదాయం.! దీనికి ప్రభుత్వం సాయం కూడా.!!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఒకరి కింద కష్టపడి పని చేసే బదులు మనమే కష్టపడి సంపాదించుకుంటే మనకే మిగులుతాయి కదా అని ఆలోచిస్తుంటారు. కరోనా వచ్చాక చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి వాళ్లలో కొందరు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరి కొందరు వ్యవసాయం చేసుకుంటూ డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే సాంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయాన్ని చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారిలో చాలామంది ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలను పండిస్తూ సంపాదిస్తున్నారు.
బే ఆకు సాగు కూడా మంచి లాభదాయకమైన వ్యాపారం. బే ఆకు సాగును కమర్షియల్ పద్ధతిలో సాగు చేస్తే, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. అలాగే ఈ సాగుకు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఈ బే ఆకులను ఒకసారి నాటితే అవి చాలా సంవత్సరాలు దిగుబడిని ఇస్తాయి. ఈ ఆకు సాగుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. దీనివలన సులువుగా ప్రారంభించవచ్చు. బే ఆకు మొక్కలను నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరంలో లైన్ నుండి లైన్ మధ్య తగినంత దూరంలో నాటాలి. అలాగే క్రమం తప్పకుండా నీటిని అందించాలి. ఈ మొక్కలు చిన్నగా ఉన్నంతవరకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలను నాటవచ్చు. దీని ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
దీని సాగుకు రైతులకు గవర్నమెంట్ 30% సబ్సిడీను అందిస్తుంది. సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బే ఆకు మొక్కలు ఒక మొక్క నుంచి ఐదు వేల రూపాయల సంపాదించవచ్చు. ప్రతి సంవత్సరం 75 వేల నుండి ఒక లక్ష 25 వేల వరకు సంపాదించవచ్చు. ఎక్కువ మొక్కలు నాటితే ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగే మీ ఆదాయం మార్కెటింగ్ వ్యూహంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇతర రైతుల నుంచి ఆకులను తీసుకొని అమ్ముకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఎక్కువ ఆదాయం పొందవచ్చు.