Business Idea : బిజినెస్ చేయాలనుకుంటున్నారా… అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా…
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. కరోనా వచ్చాక చాలా మంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. అలాంటి వారు కొందరు సొంత వ్యాపారాలను పెట్టుకొని లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. మరికొందరు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరి తమ జీవనాన్ని గడుపుతున్నారు. సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కని బిజినెస్ ఐడియా. సీజన్ కి అనుగుణంగా వ్యాపారం చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ క్రమంలో అలాంటి వ్యాపార ఆలోచనలను మీకు అందిస్తున్నాం. అయితే ఇందులో నష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. లాభం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడి తో మొదలు పెట్టవచ్చు. అదే ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ వ్యాపారానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీనిని మొదలు పెట్టడానికి 10 ,20 వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని పొందవచ్చు. వ్యాపారం పెరిగే కొద్దీ ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ వ్యాపారం దేశంలో ప్రతి ప్రాంతంలో సాగుతుంది. అయినప్పటికీ ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మీరు 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్ ను ప్రారంభించవచ్చు. ఇందులో ఐదు పదిమందికి సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఫుడ్ కోర్ట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం దేశంలో ఐస్క్రీమ్ వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి ఒక బిలియన్ దాటుతుంది.
ముందుగా మీరు ఐస్ క్రీమ్ పార్లర్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అదారికి ఆఫ్ ఇండియా నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్, మీ స్థలంలో తయారు చేసిన ఆహార పదార్థాలు వాటి నాణ్యతను ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారిస్తుంది. అలాగే మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్లను ఫ్రాంచైజింగ్ చేసుకోవచ్చు. అందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాలి. ఐస్ క్రీమ్ వ్యాపారంలో లాభాలు మీరు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.