Government Jobs : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ 10లక్షలకు పైగా ఉద్యోగాలు..!!
Government Jobs : ప్రపంచంలో మరియు దేశంలో నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం కారణంగా చాలా కంపెనీలు మూత పడిపోతున్నాయి. దీంతో అర్ధాంతరంగా ఉద్యోగాలు పీకేస్తున్నారు. ముఖ్యంగా ఐటీఫీల్డ్ లో పరిస్థితి మరి దారుణంగా దిగజారి పోతుంది. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక శుభవార్త తెలియజేశారు. కేంద్ర మంత్రతో శాఖ డిపార్ట్మెంట్లలో ఏకంగా 10 లక్షల కు పైగానే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
2021 మార్చి 1నాటికి 78 కేంద్ర మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లలో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంటులో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇందులో అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు, రక్షణ రంగంలో 2,64,706 పోస్టులు, కేంద్ర హోం శాఖలో 1,43,536 పోస్టులు, పోస్టల్‌లో 90,050 పోస్టులు, రెవెన్యూలో 80,243 పోస్టులు, ఇండియన్ ఆడిట్,
అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ లో 25,934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.మొత్తం 40,35,203 పోస్టులకు గానూ, దాదాపు పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఏడాదిన్నర కిందటి లెక్కలు ఇవి. ఇప్పుడు మరిని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లెటర్ సమాధానం పట్ల నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి భారీగా నోటిఫికేషన్ లు విడుదల కానున్నట్లు నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.