Navodaya Vidyalaya Samiti : ప‌రీక్ష లేకుండానే న‌వోద‌య విద్యాలయాల్లో టీచ‌ర్ పోస్ట్‌లు.. ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navodaya Vidyalaya Samiti : ప‌రీక్ష లేకుండానే న‌వోద‌య విద్యాలయాల్లో టీచ‌ర్ పోస్ట్‌లు.. ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Navodaya Vidyalaya Samiti : ప‌రీక్ష లేకుండానే న‌వోద‌య విద్యాలయాల్లో టీచ‌ర్ పోస్ట్‌లు.. ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే..!

Navodaya Vidyalaya Samiti : నేటి కాలంలో జాబ్‌లు సంపాదించాలంటే ఎంత క‌ష్ట‌మ‌వుతుందో మ‌నం చూస్తున్నాం. ప్రైవేట్ జాబుల‌కే నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది. ఇకప్రభుత్వ ఉద్యోగాలు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చిన్నదైనా సరే గవర్నమెంట్‌ జాబ్‌ రావాలంటే.. కచ్చితంగా ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ కావాలి. ఆ త‌ర్వాత ప‌లు ఇంట‌ర్వ్యూలు, వాటిలో వ‌డ‌పోత పోసి ఉద్యోగం ఇస్తారు. అయితే ఉద్యోగం పొందాలంటే పరీక్ష తప్పనిసరి కాగా, ఇప్పుడు ఎలాంటి ఎగ్జామ్‌ లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ నవోదయ పాఠశాలల్లో ఇస్తున్నారు. భారీ ఎత్తున టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫి​​కేషన్‌ విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీటికి ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు.

Navodaya Vidyalaya Samiti : రాత ప‌రీక్ష లేకుండానే..

ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను అందుకుంటున్నారు. ఏప్రిల్‌ 26 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు. అయితే మొత్తం టీచర్‌ పోస్టులు : 500 కాగా, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులు: 283. ఇక సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)

Navodaya Vidyalaya Samiti ప‌రీక్ష లేకుండానే న‌వోద‌య విద్యాలయాల్లో టీచ‌ర్ పోస్ట్‌లు ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే

Navodaya Vidyalaya Samiti : ప‌రీక్ష లేకుండానే న‌వోద‌య విద్యాలయాల్లో టీచ‌ర్ పోస్ట్‌లు.. ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే..!

పోస్టులు: 217, సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి. వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250.. టీజీటీలకు రూ.40,625గా నిర్ణయించారు. ఏజ్‌ లిమిట్‌: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 26, 2024

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది