7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలో ఉన్న బకాయిలకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాల్లో బకాయిలు ఉంటే, వాటికి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. ట్యాక్స్ రూల్స్ ప్రకారం, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఫామ్ 10ఈని ఆన్ లైన్ లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80 ప్రకారం రిలీఫ్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లో ఫైల్ చేయాలి. ఒకవేళ ఫామ్ 10ఈని నింపకుండా సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ క్లెయిమ్ చేస్తే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. 10ఈ ఫామ్ ను ఫైల్ చేస్తేనే సెక్షన్ 89 కింద రిలీఫ్ ను పరిగణిస్తాం అని ఇన్ కమ్ టాక్స్ నోటీసులు పంపిస్తుంది. అందుకే, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఫామ్ 10ఈని కూడా నింపాల్సి ఉంటుంది.
7th Pay Commission : ఫామ్ 10ఈని ఎలా ఫైల్ చేయాలి?
ఈ స్టెప్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఫామ్ 10ఈని ఫైల్ చేయొచ్చు. దాని కోసం http://www.incometax.gov.in కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత e-File అనే ఆప్షన్ లోకి వెళ్లి Income Tax Forms అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత File Income Tax Forms అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత tax Exemption and Reliefs/Form 10E అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్, అలవెన్సులను పే చేస్తుంటారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఐటీఆర్ ఫైల్ చేయడం కంపల్సరీ. ఈ సంవత్సరం 2022-23 సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జులై 2022. ఇప్పటికే 5.8 కోట్ల ఉద్యోగులు ఇన్ కమ్ ట్యాక్స్ ను ఫైల్ చేశారు. అలాగే ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను త్వరలోనే పెంచే అవకాశాలు ఉన్నట్టు ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల రివిజన్ విషయంలో మరే కమిషన్ ఏర్పాటు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు డీఏ రేట్ రివిజన్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.