Chandra Babu | చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి అయి నేటికి 30 ఏళ్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandra Babu | చంద్ర‌బాబు తొలిసారి ముఖ్య‌మంత్రి అయి నేటికి 30 ఏళ్లు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 September 2025,2:00 pm

Chandra Babu | ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న తన రాజకీయ జీవితంలో మరో మైలురానికి చేరుకున్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30ఏళ్లు.1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు.. ఎనిమిదేళ్ల 8 నెలల 13 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించారు.

#image_title

మూడు ద‌శాబ్ధాలు..

మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా చంద్రబాబు పనిచేశారు. నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగుతున్నారు. నేటివరకు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు.. అంటే 5,442 రోజులు సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు.15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేతగా చంద్రబాబుకి గుర్తింపు ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ముఖ్యమంత్రి పదవీకాలంలో హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది అని చెప్పాలి.

నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ.. నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి చంద్రబాబు రూపకల్పన చేశారు. 2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలతోపాటు విశాఖను ఆర్థిక, ఐటీ రాజధాని, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది