CM Jagan : విశాఖ గ్లోబల్ సమిట్ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు… ఆరు లక్షల మందికి ఉద్యోగాలు సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
CM Jagan : విశాఖపట్నం వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో మొదటిరోజు సీఎం జగన్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. దేశంలోనే అత్యుత్తమ జిడిపితో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉందని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మౌలిక వసతుల గురించి తెలియజేయడం జరిగింది. డేకార్బనైజేషన్, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, డిజిటలైజేషన్, అంట్ర పెన్యూర్ షిప్… ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాలని తెలియజేశారు. దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రమని కొనియాడారు. పరిశ్రమల అవసరాలను తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
దేశానికి నాయకత్వం వహించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ నేచర్ తో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అందుకు రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నిమగ్నం అవ్వాలని తెలిపారు. మీకు ఎలాంటి సమస్య ఉన్న ఎలాంటి.. అసౌకర్యం కలిగిన కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని అన్నారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవుతుందని… పరిపాలన ఇక్కడ నుంచే సాగిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టడానికి రావడం జరిగాయి. మొదటి రోజే 92 ఎంఓయూలు రాగా… మొత్తం 340 ఎంఓయూలు… దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకం కానుంది. 20 రంగాల్లో విపలవాత్మక సంస్కరణలు తీసుకురాబోతున్నాం. దేశంలో అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఆరు ఓడరేవులు రాష్ట్రమంతక విస్తరించి ఉన్నాయని సహజ వనరులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని సీఎం జగన్ ప్రసంగించారు.