Diabetes : ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
Diabetes : డయాబెటిస్.. షుగర్.. దీన్నే మధుమేహం అని కూడా అంటాం. ఈ వ్యాధి వస్తే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగర్ లేవల్స్ తగ్గినా.. పెరిగినా.. శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచేందుకు మెడిసిన్ ఇస్తారు డాక్టర్లు. రోజూ ఆ మెడిసిన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. లేదంటే షుగర్ లేవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. జీవితాంతం ఈ వ్యాధి మనిషిని వేధిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వంశపారపర్యంగా షుగర్ వ్యాధి నేడు ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. చిన్న వయసులో ఉన్నవాళ్లను కూడా షుగర్ అటాక్ చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా.. అన్ని రకాల వయసు వాళ్లకు షుగర్ వస్తోంది. దీంతో జనాలు షుగర్ అంటేనే హడలెత్తిపోతున్నారు.
అయితే.. ఆయుర్వేదంలో షుగర్ వ్యాధిని తగ్గించే ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. ఆయుర్వదం ద్వారా షుగర్ ను తగ్గించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని రకాల మొక్కల ఆకుల్లో షుగర్ ను కంట్రోల్ చేసే లక్షణాలు ఉన్నాయి. ఆ మొక్కల ఆకులను తింటే చాలు.. షుగర్ వద్దన్నా కూడా కంట్రోల్ లోకి వస్తుంది. ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes : Insulin Plant – ఇన్సులిన్ మొక్క
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పడిపోతేనే షుగర్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ స్థాయి ఎప్పుడూ సమానంగా ఉండాలి. అప్పుడే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచే మొక్క ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క ఆకులను రోజూ రెండు నమిలి తింటే.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయట. షుగర్ వ్యాధి చికిత్సలోనూ దీన్ని వాడుతారట. ఈ మొక్క ఆకులలో కోరోసాలిక్ అనే రసాయనం ఉంటుందట. అది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందట. రోజు ఒకటి లేదా రెండు ఆకులను తింటే.. క్రమక్రమంగా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయట.
Diabetes : పొడపత్రి మొక్క
షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచే మరో మొక్క పొడపత్రి మొక్క. ఇది ఎక్కువగా పొలాల దగ్గర, అడవుల్లో కనిపిస్తుంటుంది. ఇది కూడా ఔషధ మొక్కే. చాలా ఆయుర్వేద మందుల తయారీలో ఈ మొక్కను వాడుతారు. ఈ మొక్కనే పుట్టబద్రి మొక్క అని కూడా అంటారు. మధునాశని మొక్క అని కూడా పిలుస్తారు. ఈ ఆకులను రోజుకు ఒకటి రెండు నమిలితే.. షుగర్ లేవల్స్ వద్దన్నా కంట్రోల్ లోకి వస్తాయి. కాకపోతే ఈ మొక్క ఆకులు కాస్త చేదుగా ఉంటాయి. ఈ మొక్కల్లో ఉండే చిన్విక్ యాసిడ్.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
Diabetes : Aloe Vera – అలొవెరా
అలొవెరా మొక్క గురించి తెలుసు కదా. ఈ మొక్కలో పాంకక్రియాస్లో అనే కెమికల్ ఉంటుంది. అది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలొవెరా గుజ్జును తీసుకొని.. ఆ గుజ్జును నీటిలో వేసుకొని తాగాలి. దాని వల్ల.. షుగర్ అదుపులో ఉంటుంది. అలొవెరాలో షుగర్ ను కంట్రోల్ చేసే గుణంతో పాటు.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే.. చాలామంది అలొవెరాను నిత్యం వాడుతుంటారు.
అలాగే.. కాకరకాయ ఆకులు కూడా షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. తిప్ప తీగ ఆకులు కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నవే. షుగర్ కు సంబంధించిన చాలా ఆయుర్వేద మందుల్లోనూ ఈ ఆకులను ఉపయోగిస్తారు. అందుకే.. ఇప్పటి నుంచి షుగర్ ఉన్నవాళ్లు ఈ ఆకులను తినడం అలవాటు చేసుకోండి. షుగర్ ను తరిమికొట్టండి.
ఇది కూడా చదవండి ==> మీ శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్క చెంచా దీన్ని తినండి.. అంతే రోగాలన్నీ పరార్..!
ఇది కూడా చదవండి ==> తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!
ఇది కూడా చదవండి ==> కాకర కాయలతో తయారు చేసిన టీ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క వేర్లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు?