bitter gourd tea : కాకర కాయలతో తయారు చేసిన టీ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా…?
bitter gourd tea : బెల్లం టీ.. అల్లం టీ.. పంచదార టీ.. ఇదే కోవలో ఇప్పుడు కాకర కాయల టీ. కాకర కాయల కూర తినలేనివారికి ఇదొక ఆల్టర్నేటివ్. కటిక చేదు వల్ల కాకర కాయల కూర జోలికే వెళ్లలేకపోతున్నామంటే ఇంత కష్టపడి ఇప్పుడు కాకర కాయల టీని ఎందుకు తయారుచేసుకొని తాగాలి అనే కదా మీ డైటు?. అక్కడికే వస్తున్నా. కాకర కాయలను నూనెలో నిదానంగా ఎక్కువ సేపు ఫ్రై చేస్తే చేదు పోతుంది. అప్పుడు కూర తినటానికి కమ్మగా ఉంటుంది. కాకర కాయల టీని కూడా అలాగే ఓపిగ్గా తయారుచేసి తాగితే హెల్త్ పరంగా ఎన్నో లాభాలున్నాయి. క్యాన్సర్ ని సైతం క్యాన్సిల్ కొట్టే కెపాసిటీ కాకర కాయల టీకి ఉండటం విశేషం.
టీ ఎట్ల పెట్టాలంటే.. bitter gourd tea
కాకర కాయలను ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ముక్కలను ఒక గిన్నెలోని నీళ్లలో వేసి వేడిచేయాలి. పావు గంటసేపు మరిగించాలి. తర్వాత ఆ కాకర కాయల రసాన్ని వేరు చేసి దానికి తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని నిత్యం తాగితే బీపీ సమస్య ఈజీగా నయమవుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. చెడు కొవ్వు కరిగిపోతుంది. స్థూల కాయులు సన్న బడతారు. బాడీలోని వ్యర్థ పదార్థాలన్నీ తొలిగిపోతాయి.
నిరోధక శక్తి.. : bitter gourd tea
కాకర కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు మన దరి చేరవు. కాకర కాయల టీ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల రోజూ ఈ తేనీరు తాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకర కాయల తీగలను పెరట్లో పెంచుకోవచ్చు. ఆ తీగలకు కాసే కాయలతో కూర వండుకోవచ్చు. లేదా టీ పెట్టుకొని తాగొచ్చు. తద్వారా వేల, లక్షల రూపాయల ఖర్చయ్యే వ్యాధులను ఉచితంగా నయం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> పొద్దు తిరుగుడు గింజల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఈ విషయం తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> మేడి పండు + మర్రి పండు = అత్తి పండు.. పోషకాలు నిండు.. ఆరోగ్యం మెండు..
ఇది కూడా చదవండి ==> అలోవేరాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..? ఎక్కడ కనిపించినా ముందు ఇంటికి తెచ్చుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఆల్ బుఖారా పండ్లను ఎప్పుడైనా తిన్నారా? వర్షాకాలంలోనే దొరికే ఈ పండ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?